VIDEO: మార్కెట్ కమిటీ వద్ద యూరియా కోసం వాగ్వాదం

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ వద్ద యూరియా కోసం బీఆర్ఎస్ నాయకులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ భర్త మధ్య వాగ్వాదం జరిగింది. రైతులను రెచ్చగొడుతున్నారంటూ ఛైర్మన్ భర్త ఆరోపించగా, తమను రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు.