రాజకీయ యుద్ధభేరీకి కదిలిన బీసీ సంక్షేమ సంఘం
NLG: హైదరాబాదులో ఇందిరాపార్క్‌లో జరుగుతున్న బీసీల రాజకీయ యుద్ధభేరీకి బీసీలకు విద్యా ఉద్యోగ చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ ఆదివారం మిర్యాలగూడ పట్టణం నుంచి జిల్లా బీసీ సంక్షేమ సంఘం బయలుదేరింది. ఈ కార్యక్రమంలో మహిళా కార్యదర్శి బంటు కవిత, బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ, బీసీ యువజన నాయకులు రామకృష్ణ, బంటు సాయి, తదితరులు పాల్గొన్నారు.