బాలికపై లైంగిక వేధింపులు.. 13 మందిపై కేసు
KNR: జమ్మికుంట(M)లో 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసు సంచలనం రేపింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి సుమారు 13మంది అనుమానితులపై దర్యాప్తు మొదలు పెట్టారు. బంధువులు, పాఠశాల సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెదిరింపులతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. HZB సబ్ డివిజన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.