కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్
KMR: రామారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్, స్టీఫెన్ రవీంద్ర వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి, ప్యాడీ కొనుగోలు కేంద్రాల పనితీరును పరిశీలించారు. ప్యాడీ కొనుగోలులో భాగంగా పని చేస్తున్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.