బియ్యాల వలస పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు

PPM: కురుపాం మండలంలోని బియ్యాల వలస గ్రామ పరిసర ప్రాంతాల్లో అరటి, చెరుకు, పామాయిల్ తోటల్లో గురువారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసర గ్రామాల ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు, ఆ రహదారి వెంట వెళ్లే వాహన చోదకులు ఎప్పటికప్పుడు ఏనుగుల కదలికలు తెలుసుకుని వెళ్లాలని సూచించారు.