మహబూబ్నగర్‌లో రోడ్డు భద్రతా కార్యక్రమం
MBNR: జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు వన్ టౌన్‌లో 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం జరిగింది. ఇన్స్‌స్పెక్టర్ అప్పయ్య వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రాణహానికరమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై సీనయ్య, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.