వైభవంగా వెంకన్న విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని బాలుపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం కార్యక్రమం శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు, స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.