కలెక్టరేట్‌లో భక్త కనకదాసు జయంతి
ASR: రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి కనకదాసు అని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. భక్త కనకదాసు ఒక గొప్ప కవిగా, తత్వవేత్తగా, అపారమైన సామాజిక సంస్కర్తగా అందించిన సేవలను దేశం స్మరించుకుంటోందని తెలిపారు. మంగళవారం భక్త కనకదాసు జయంతిని కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.