నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

W.G: ఆకివీడు శ్రీ వణువులమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలకవర్గం మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఛైర్మన్‌గా కొల్లి వెంకన్న బాబు బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్లుగా బి.నాగదుర్గ, ఎ.సుబ్రహ్మణ్యం, దర్శి విజయ్ కుమార్, జి.మణి, బి.అశోక్ కుమార్, టి.పేరంటాలు, కె.విజయ, టి.రత్నకుమారి ప్రమాణం చేశారు. వీరందరికీ ఆలయ ఈవో అల్లూరి సత్యనారాయణరాజు ప్రమాణ స్వీకారం చేయించారు.