ఓటరు జాబితా క్రమబద్ధీకరణ పై సందేహాలు
VZM: ఓటరు జాబితా క్రమబద్ధీకరణ పై సందేహాలు తెలపాలని గజపతినగరం నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ప్రమీలా గాంధీ కోరారు. బుధవారం గజపతినగరం తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీ నేతలతో సమావేశం జరిగింది. కుటుంబంలోని అందర్నీ ఒకే దగ్గరికి తీసుకువచ్చి జాబితా రూపొందించామని, ఈ జాబితా ప్రతులను రాజకీయ పార్టీ నేతలకు అందజేస్తామన్నారు.