రాయచోటిలో కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్ట
అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని ఎస్టీ కాలనీలో శ్రీ కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. పురోహితులు వేద ఆశీర్వచనం అందించారు. ప్రజలపై శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.