జీతాలు లేక 102, 108 అంబులెన్స్ సిబ్బంది ఆవేదన
వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న 102,108 అంబులెన్స్ టెక్నీషియన్లు, పైలట్లు గత రెండు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ కుటుంబాలను పోషించలేని పరిస్థితి నెలకొందని సిబ్బంది వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయి వేతనాలు విడుదల చేయాలని మంగళవారం డిమాండ్ చేశారు.