క్రికెట్ అభిమానులకు హెడ్ క్షమాపణలు
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు ఆదరణ ఎక్కువ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో వేలాది మంది తొలి టెస్ట్ మూడో రోజుకు కొనసాగుతుందేమోనని టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే ఆసీస్ ఓపెనర్ ట్రావిడ్ హెడ్ విధ్వంసకర ఇన్నింగ్స్(123)తో ఆట రెండో రోజే ముగిసింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం హెడ్ మాట్లాడుతూ రేపటి కోసం టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.