'భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు'

'భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు'

RR: మొయినాబాద్ తహశీల్దార్ గౌతమ్‌కుమార్ ప్రభుత్వ భూముల కబ్జాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తోల్కట్ట గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో.. సర్వే నంబర్ 107లో రెండు ఎకరాల్లో నిర్మిస్తున్న అక్రమ ఫెన్సింగ్‌ను అధికారులు జేసీబీ సాయంతో తొలగించారు. అదనపు ఆర్ఐ రాజేష్ నేతృత్వంలో ప్రభుత్వ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు.