రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

MBNR: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో చోటుచేసుకుంది. SI లెనిన్ వివరాల ప్రకారం.. చిన్నంగులగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని రాజ్యా నాయక్ తండాకు చెందిన తావూర్య (52) ఇటుక బట్టీలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదివారం పెద్దాయపల్లి చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.