VIDEO: సమ్మెకు గోడపత్రిక విడుదల
VSP: విశాఖపట్నం మహారాణిపేటలో ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా భవన నిర్మాణ కార్మిక సంఘం గోడపత్రికను విడుదల చేసింది. కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచాలని, సంక్షేమ బోర్డు, బీమా, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు.