మహిళను వేధించిన కేసులో వ్యక్తికి జరిమానా

మహిళను వేధించిన కేసులో వ్యక్తికి జరిమానా

AKP: పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను వేధించిన కేసులో ఓ వ్యక్తికి ఎలమంచిలి కోర్టు రూ. 10,000 జరిమానా విధించినట్లు సీఐ అప్పన్న బుధవారం తెలిపారు. మాసాహెబ్ పేటలో 2019లో మహిళను వేధించిన కేసులో కె వరహాల రావుపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో వరహాలరావును దోషిగా నిర్ధారించి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.