కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి మండలం పేరంగుడిపల్లి గ్రామ సమీపంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సందర్శించారు. ఈ విద్యాలయం ప్రాంగణంలో కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని ఆయన తెలిపారు.