కడపలో చెత్త నిర్వహణ కేంద్రాలపై కమిషనర్ తనిఖీ
KDP: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర పుట్లంపల్లి ఎంసీసీ, ఎంఆర్ఎఫ్ సెంటర్ మరియు సీ & డీ వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్‌ను సందర్శించి చెత్త ప్రాసెసింగ్ విధానాన్ని పరిశీలించారు. నగరంలో సేకరించే తడి, పొడి చెత్తను శాస్త్రీయ విధానంలో ప్రాసెస్ చేయాలని అధికారులకు సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు కూడా సహకరించాలని కమిషనర్ కోరారు.