సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో.. అంబులెన్స్ కోసం కృషి
NRPT: హిందూపూర్ గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి రేష్మ తన మేనిఫెస్టోను విడుదల చేశారు. బీసీలకు శ్మశానవాటిక, ముస్లింలకు కబ్రిస్తాన్ కాంపౌండ్ వాల్, గ్రంథాలయం ఏర్పాటుతో పాటు, గ్రామ పంచాయతీ తరఫున మినీ అంబులెన్స్ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని సోమవారం ఆమె హామీ ఇచ్చారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కూడా హామీలలో ఉన్నాయి.