ఉప్పల్‌లో అధికంగా హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్..!
MDCL: ఉప్పల్ పరిసర ప్రాంతాలలో హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. కొద్దిపాటి దూరానికి అయినా సరే, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కేవలం 10 రోజుల్లోనే 1543 మందికి పైగా హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేసినట్లు పేర్కొన్నారు.