రంగంపేటలో ఆలోచింపజేస్తున్న సైకత శిల్పం
E.G: అంతర్జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం సందర్భంగా రంగంపేటలో దేవిన సోహిత, ధన్యతలు రూపొందించిన సైకత శిల్పం ఆలోచింపజేస్తుంది. 'బాలికలను కాపాడండి అనే నినాదంతో' అబార్షన్లు, అత్యాచారాలు, లింగ వివక్ష, బాల్య వివాహాలు, చుట్టుముట్టిన ఓ బాలిక భయపడుతూ.. 'మాపై అకృత్యాలకు అంతం లేదా అని ప్రశ్నిస్తున్నట్టుగా' సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.