తిరువూరులో రేపు ఎమ్మెల్యే ప్రజాదర్బార్
ఎన్టీఆర్: తిరువూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొని, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారని తెలిపారు.