వెల్దుర్తిలో ఈనెల 17న జాబ్ మేళా

వెల్దుర్తిలో ఈనెల 17న జాబ్ మేళా

KRNL: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17న వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ మేళాలో 14కుపైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. పది, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఆయన కోరారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.