పెద్దిరెడ్డిపల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

పెద్దిరెడ్డిపల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

NLR: వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు ఆయన కీలకపాత్ర పోషించారని, ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహానుభావుడని గుర్తుచేశారు.