VIDEO: ఏడుపాయలలో అమ్మవారికి పౌర్ణమి పూజలు
MDK: పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లి శివారులో వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో గురువారం తెల్లవారుజామున పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో రుత్వికులు అమ్మవారికి పంచామృతాలు మంజీరా నది గంగాజలంతో అభిషేకం చేసి మంగళహారతి సమర్పించారు. అనంతరం అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.