గాజువాకలో అధ్వాన రోడ్డుతో అవస్థలు

గాజువాకలో అధ్వాన రోడ్డుతో అవస్థలు

విశాఖ: గాజువాక జగ్గు జంక్షన్ నుంచి స్టీల్ ప్లాంట్‌కు వెళ్లే ప్రధాన రహదారి గోతులమయంగా మారిపోయి వరదనీరు నిలిచిపోయింది. ఈ రోడ్డులో రోజూ భారీ వాహనాలతో వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ముఖ్యంగా పరవాడ వెళ్లాలంటే ఈ రోడ్డు దాటాల్సిందే. గుంతలు తప్పించేందుకు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.