ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
W.G: తణుకు పట్టణంలో గురువారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కారుమూరి దివంగత నేత వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ.. మాట తప్పని మడమతెప్పని నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.