సూర్యాపేట 'జనరల్' జాతర!
సూర్యాపేట మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ వీడింది. ఛైర్మన్ పదవిని 'జనరల్'కు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. ఆశావహులు రెట్టింపు ఉత్సాహంతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. పట్టున్న వార్డుల్లో పాగా వేసి గద్దెనెక్కాలని హేమాహేమీలు తహతహలాడుతున్నారు. గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు తలమునకలవడంతో జిల్లా కేంద్రంలో ఎన్నికల రాజకీయం సెగలు పుట్టిస్తోంది.