మహిళా దినోత్సవం సందర్బంగా ర్యాలీ

PPM: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెప్మా సీఎంవో పుష్ప ఆధ్వర్యంలో గురువారం సాలూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పలువురు మహిళలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు మగవారితో సమానంగా రాణించాలని, బాల్య వివాహాలు నివారించాలని అన్నారు.