క్రిస్మస్ బరిలో 'దండోరా'
సీనియర్ నటుడు శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'దండోరా'. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బిందు మాధవి వేశ్య పాత్రలో కనిపించనుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.