లారీ, బైక్ ఢీకొని వ్యక్తి మృతి

లారీ, బైక్ ఢీకొని వ్యక్తి మృతి

NLR: వింజమూరు మండలం కాశీనాయన ఆశ్రమం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న పవన్‌ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.