నాలుగో రోజు పుస్తక ప్రదర్శనకు సందర్శకులు తాకిడి
SKLM: పట్టణంలోని 7 రోడ్ల కూడలి సమీపంలో శుక్రవారం నాలుగో రోజు సిక్కోలు పుస్తక మహోత్సవం విజయవంతంగా కొనసాగింది. సందర్శకులు ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి, తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. ప్రముఖ ప్రచురణ సంస్థలు తమ విభిన్న శ్రేణి పుస్తకాలను అందుబాటులో ఉంచడంతో పాఠకులు సంతోషం వ్యక్తం చేశారు.