'పేదవాడి సొంతింటి కల నెరవేరాలి'
ADB: ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం జరిగిందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. సోమవారం తాంసి మండలం గోట్కూరి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను శాలువాతో ఘనంగా సత్కరించారు.