రాష్ట్ర అంచనాల కమిటీకి స్వాగతం పలికిన జేసీ
VZM: రాష్ట్ర అంచనాల కమిటీ బుధవారం సాయంత్రం జిల్లాకు చేరుకున్నారు. కమిటీ ఛైర్మెన్ వి. జోగేశ్వరరావు, సభ్యులు నిమ్మక జయకృష్ణ, డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజులకు జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, డిఆర్వో ఎస్. శ్రీనివాసమూర్తి స్థానికంగా ప్రైవేట్ అతిధిగృహం వద్ద పుష్ప గుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. జిల్లాకు సంబంధించి అధికారులతో కొద్దిసేపు ముచ్చటించారు.