VIDEO: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవకతవకలు
HNK: హన్మకొండ వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇవ్వాళ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం లేకుండా డాక్యుమెంట్లు ఇవ్వడం లేదన్న ఆరోపణలతో గత నాలుగు నెలలుగా సుమారు 204 ఫైళ్లను పెండింగ్‌లో ఉంచినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. సోదాల సందర్భంగా 20 మంది మధ్యవర్తుల వద్ద నుంచి రూ. 45 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.