విద్యార్థినులకు శక్తి యాప్‌పై అవగాహన

BPT: కర్లపాలెం మండలం పెదగోళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థినులకు శక్తి యాప్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించారు. శక్తి పోలీస్ ఎస్సై అనిత మాట్లాడుతూ.. బాలికలపై జరిగే లైంగిక వేధింపులు, ఇతర నేరాల గురించి వివరించారు. వాటి నుంచి రక్షణ పొందేందుకు ఉపయోగపడే చట్టాలు, శక్తి యాప్ గురించి తెలిపారు.