సాయిబాబా మందిరంలో అన్నదానం
SRPT: కార్తీక మాసం చివరి గురువారాన్ని పురస్కరించుకుని నడిగూడెం సాయి మందిరంలో సాయిబాబాకు పంచ హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మందిర పూజారి రాజశేఖర్ శర్మ భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సాయి అన్నప్రసాద వితరణ కేంద్రంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.