తొర్రూర్ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు

తొర్రూర్ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు

MHBD: తొర్రూర్ పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం కన్యస్వాముల పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. నర్సింహా గురుస్వామి, శివశర్మ గురుస్వాములు కన్య స్వాముల పడి పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొర్రూర్ చుట్టూ గ్రామాల నుంచి 500 మంది కన్య స్వాములు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు అయ్యప్ప కీర్తనలు ఆలపించుకుంటూ దేవాలయంలో సందడి చేశారు.