నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కృష్ణా: చల్లపల్లి మండలంలో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ కృష్ణ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని మంగళాపురం విద్యుత్ మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలు వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.