దారుణం.. పట్టపగలే దారిదోపిడీ

దారుణం.. పట్టపగలే దారిదోపిడీ

TG: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో పట్టపగలే దారి దోపిడీ జరిగింది. స్టీల్‌ వ్యాపారిని బెదిరించి దుండగులు రూ.40 లక్షలు లాక్కున్నారు. వ్యాపారి కారును అడ్డుకొని కత్తులతో బెదిరించారు. డబ్బు ఉన్న బ్యాగుతో పారిపోతుండగా.. అదుపుతప్పి వారి వాహనం బోల్తా పడింది. దీంతో వాహనాన్ని అక్కడ వదిలేసి.. డబ్బు బ్యాగును తీసుకొని దుండగులు పారిపోయారు. పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.