బొబ్బిలిలో పందెం రాయళ్లు అరెస్ట్

VZM: బొబ్బిలి మండలంలోని పాతపెంట గ్రామ శివారులో గొర్రెపోతు పొట్లాట పందెం స్థావరాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. తమకి రాబడిన ముందస్తు సమాచారంతో సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించగా పందెం ఆడుతున్న 10 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రెండు గొర్రె పోతులు రూ. 2,120 నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.