నల్లమల అడవిలో పులి గోళ్ల మాయం కలకలం
NDL: నల్లమల అడవిలో పులి గోళ్ల మాయం ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ముఖ్యంగా మహానంది, గోపవరం, నంద్యాల ప్రాంతాల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అక్రమ వేటగాళ్ల చర్యలపై అటవీ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనతో పులుల సంరక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది.