మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన MLA

మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన MLA

హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈనెల 28న జరుగు గీత కార్మికుల శంఖారావం నాల్గవ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం రాత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కల్లు గీత కార్మిక సంఘం జిల్లా నూతన కార్యవర్గ సభ్యులతో కలిసి వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బుర్ర శ్రీనివాస్, బండి రంజిత్ కుమార్ పాల్గొన్నారు.