'5,98,710 మందికి గృహాలు మంజూరు'

'5,98,710 మందికి గృహాలు మంజూరు'

AKP: రాష్ట్రవ్యాప్తంగా 5,98,710 మందికి గృహాలు మంజూరు చేసినట్లు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు తెలిపారు. బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీలకు 1,57,325 ,ఎస్‌టి లకు-45,765, బీసీ-3,73,204 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. బీసీ, ఎస్సీలకు అదనంగా రూ. 50వేలు చొప్పున, ఎస్టీలకు రూ. 75 వేల చొప్పున మొత్తం 3,819 కోట్లు ఇస్తున్నామన్నారు.