నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
BDK: ఇల్లందు మండలంలో ఇవాళ ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మండలంలోని రేపల్లెవాడ, కొమరారం, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. కావున మండలంలోని కార్యకర్తలు నాయకులు పాల్గొనాలని సూచించారు.