VIDEO: తాగుబోతులకు అడ్డాగా మారిన గండిమైసమ్మ చౌరస్తా

MDCL: దుండిగల్ PS పరిధిలోని గండిమైసమ్మ చౌరస్తాలో తాగుబోతుల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజరాజేశ్వరి కాలనీలోని ఉజ్వలబార్ సమీపంలోని ఖాళీస్థలం తాగుబోతులకు అడ్డాగా మారింది. దీంతో అటుగా వెళ్లే మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.