కురవిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
MHBD: కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థిని దివ్యశ్రీ చౌహాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యార్థినికి తండ్రి కిషన్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి, పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.