జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీ

జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీ

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. మొత్తం 38 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్స్‌గా పదోన్నతులు కల్పిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డర్స్ అందిన 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని, లేనిపక్షంలో పదోన్నతి కోల్పోతారని అధికారులు స్పష్టం చేశారు.