కొత్త బస్సులు మంజూరు చేయాలని మంత్రికి వినతి

కొత్త బస్సులు మంజూరు చేయాలని మంత్రికి వినతి

KNR: హుజూరాబాద్‌లోని పలు ప్రాంతాలకు నూతన బస్సు సర్వీసులు మంజూరు చేయాలని కాంగ్రెస్ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ కోరారు. హైదరాబాద్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే కొన్ని మార్గాల్లో బస్సులు నడుస్తున్నాయని, మిగిలిన ప్రాంతాలకు సర్వీసులు పెంచి, డిపో అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.